Header Banner

జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి నార్మల్.. అమృత్‌సర్‌లో ఇంకా కొనసాగుతున్న హై అలర్ట్!

  Sun May 11, 2025 12:13        Politics

జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి నార్మల్‌గా ఉంది. గత రాత్రి ఉద్రిక్తత పరిస్థితుల తర్వాత జమ్మూ, అఖ్నూర్, రాజౌరిలో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. గత అర్దరాత్రి దాటిన తర్వాత పాక్ వైపు నుంచి ఎలాంటి ఎలాంటి డ్రోన్ల దాడి, ఫైరింగ్ జరగలేదని తెలుస్తోంది. అలాగే పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్‌‌లలో కూడా పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టుగా సమాచారం. అయితే పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మాత్రం ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, అయినప్పటికీ రెడ్ అలెర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలెర్ట్‌కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అంతకుముందు, తెల్లవారుజామున 4:39 గంటలకు కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, కిటికీలు, రోడ్లు, బాల్కనీలు లేదా టెర్రస్‌ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభించవచ్చో తెలియజేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia